మెదక్ గెలిచి ముఖ్యమంత్రి రేవంత్కు గిప్ట్ గా ఇస్తాం : కొండా సురేఖ

-

మెదక్ లోక్ సభ స్థానాన్ని గెలిచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇస్తామన్నారు మెదక్ సెగ్మెంట్ ఇంచార్జి,మంత్రి కొండా సురేఖ. సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరులో పార్టీ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ…మెదక్ ఎంపీ కాంగ్రెస్ అభర్థి నీలం మధును గెలిపించడానికి కార్యకర్తలు,నియోజకవర్గ ఇంచార్జీలు కష్టపడాలని కొండా సురేఖ కోరారు. కొత్తగా వస్తున్న నేతలను సైతం చేర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. పాత నేతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని కొండా సురేఖ హామీ ఇచ్చారు.

మరోవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పేరు అనవసరంగా తీస్తున్నారంటూ, లీగల్ నోటీసులు పంపిస్తానన్న కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు.’నాకైతే ఏ నోటీసులూ రాలేదు. మనది ప్రజాస్వామ్య దేశం. మాట్లాడే హక్కు ఉంది అని అన్నారు. ఆయన చెప్పినదానికి నేను కౌంటర్ మాట్లాడా. అది ఆయనకు బాధ కలిగిస్తే ఏం చేస్తాడో చేసుకోనివ్వండి అని తర్వాత మేమేం చేయాలో అది చేస్తాం. నేను ఏదైనా ఓపెన్గా మాట్లాడతా. కేటీఆర్ నోరు దగ్గర పెట్టుకోవడం మంచిది అని చెప్పా అంతే’ అని ఆమె వివరించారు.

 

Read more RELATED
Recommended to you

Latest news