జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫ్రస్టేషన్ పీక్స్ కి చేరిపోయిందని రోజా అన్నారు సీఎం జగన్ పవన్ కళ్యాణ్ ఒకేసారి పార్టీలు పెట్టారని అయితే జనసేన బలోపేతం కాకపోవడానికి ఎవరు కారణమని అన్నారు. ఆవేశానికి అరుపులు కి ఓట్లు పడవని పవన్ తెలుసుకోవాలని రోజా అన్నారు. ఆర్ నారాయణ మూర్తి ఎప్పుడో ప్రధానమంత్రి అయ్యే వారని రోజా అన్నారు.
ప్రజలకి ఏం చేయబోతున్నారని ముందు చెప్పాలని అన్నారు. అధికారం చేపట్టాలనే లక్ష్యంతో ప్రతిపక్షపాతి నాయకుడిగా ఏం చేశావు అనేది ప్రజలు గమనిస్తారని చెప్పారు జగన్ పార్టీ పెట్టి 151 సీట్లు సాధించి తిరుగులేని ముఖ్యమంత్రి అయ్యారని, పవన్ కళ్యాణ్ మాత్రం రెండు చోట్ల ఓడిపోయారని మంత్రి రోజూ అన్నారు. ఓ పార్టీ ప్రెసిడెంట్ గా ఉండి 24 సెట్లకే పరిమితం కావడం సిగ్గుచేటు అని అన్నారు ఇప్పటిదాకా జనసేన బూత్ మండల కమిటీల నిర్మాణ పనులు చేయలేదని అన్నారు. 30 సీట్లు కూడా తెచ్చుకోలేని పవన్ చంద్రబాబు కాళ్ళ వద్ద పనిచేస్తూ జనసైనికుల్ని తాకట్టు పెడుతున్నారని అన్నారు.