కన్నడ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రౌడీ హీరో..!

-

యంగ్ హీరో విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాల్ లో ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్ చేసి ప్రేక్షకులకు బాగా దగ్గరయిన ఈయన పెళ్లిచూపులు సినిమాతో హీరోగా అవతారం ఎత్తాడు. ఆ తర్వాత అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ లోనే పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ.. ఆ తర్వాత గీతా గోవిందం , డియర్ కామ్రేడ్ వంటి సినిమాలతో మరింత పాపులారిటీ దక్కించుకున్నాడు. ఇదిలా ఉండగా ఇటీవల పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాలో నటించి పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.

అప్పటినుంచి మీడియా ముందుకు ఎక్కువగా రావట్లేదు. తన నెక్స్ట్ సినిమాలో అప్డేట్స్ కూడా ఏమీ లేవు.. సమంతతో కలిసి నటిస్తున్న ఖుషీ సినిమా కూడా షూటింగ్ ఆగిపోయింది . సమంతకి అనారోగ్య కారణంగా సినిమా మొదలు కాలేదు. ఈ గ్యాప్ లో విజయ్ దేవరకొండ తన నెక్స్ట్ సినిమాని సెట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరికి విజయ్ ఛాన్స్ ఇచ్చాడు అన్న వార్త మొన్నటి వరకు బాగా స్ప్రెడ్ అయింది కానీ అధికారికంగా ప్రకటన రాలేదు. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. కన్నడ డైరెక్టర్ నర్తన్.. విజయ్ కి ఒక అదిరిపోయే స్టోరీ నెరేట్ చేసినట్టు.. దానికి విజయ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ లో వార్త వినిపిస్తోంది.

కన్నడలో శివరాజు కుమార్ తో మఫ్టీ సినిమా చేసిన నర్తన్ రాంచరణ్ మూవీ చేస్తున్నాడని.. యువి క్రియేషన్స్ ఈ సినిమా నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నారని గతంలో వార్తలు వినిపించాయి. అయితే నర్తన్ చెప్పిన స్టోరీ ఇప్పుడు విజయ్ దేవరకొండకు నచ్చడంతో దిల్ రాజు .. మరో కన్నడ నిర్మాణ సంస్థతో కలిసి నిర్మించబోతున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం కూడా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news