చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్లో బెంగళూరు మొదట బ్యాటింగ్ చేస్తే 18 పరుగుల తేడాతో గెలవాలి. అదే ఛేదనలో అయితే 18.1 ఓవర్లలోనే మ్యాచ్ను ముగించాలి. అప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ కంటే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు రన్డేట్ మెరుగవుతుంది. అదే సమయంలో సన్ రైజర్స్ హైదరాబాద్ , లక్నో సూపర్ జెయింట్స్ తమ చివరి రెండు మ్యాచ్లో కనీసం ఒక్క మ్యాచ్లోనైనా ఓడిపోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్సీబీపై చెన్నై గెలిస్తే బెంగళూరు ఆశలన్నీ గల్లంతై ఇంటి బాట పట్టనుంది.
ఇదిలా ఉంటే… రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు కీలక సమయంలో భారీ షాక్ తగిలింది. ఆ జట్టు బ్యాటింగ్ లైనప్లో కీలకంగా మారిన విల్ జాక్స్ జట్టును వీడారు. ఆయనతో పాటు పేసర్ టాప్లే టీ20 ప్రపంచకప్ కోసం తమ స్వదేశమైన ఇంగ్లండు పయనమయ్యారు. ప్లేఆఫ్స్ అవకాశాలు క్లిష్టంగా ఉన్న ఈ సమయంలో కీలక ప్లేయర్లు దూరం కావడం ఆ జట్టుకు పెద్ద దెబ్బేనని విశ్లేషకులు భావిస్తున్నారు.