IPL 2021 : పంజాబ్ పై 6 వికెట్ల తేడాతో బెంగుళూరు గెలుపు.. నేరుగా ప్లే ఆప్స్ కు ఎంట్రీ

రాయల్ చాలెంజర్స్ బెంగళూ రు మరియు పంజాబ్ కింగ్స్ మధ్య ఇవాళ బిగ్ ఫైట్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ భీకర పోరులో పంజాబ్ కింగ్స్ పై… రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.. అద్భుత విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ జట్టుపై ఏకంగా ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.

165 పరుగుల లక్ష్య ఛేదన కు దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు బ్యాట్స్మెన్లను…ఓ ఆట  ఆడేసుకున్నారు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు బౌలర్లు. దీంతో  20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి కేవలం 158 పరుగులు చేసింది పంజాబ్ కింగ్స్. దీంతో మంగళూరు జట్టు విజయం సాధించింది.

పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ వివరాల్లోకి వెళితే… మయాంక్ అగర్వాల్ 57 పరుగులు, మరియు కె.ఎల్.రాహుల్ 39 పరుగులు మరియు మక్రం 20 పరుగులు తీసినా.. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ విఫలం కావడంతో… మ్యాచ్ చేజారింది. ఇక ఈ విజయంతో నేరుగా ప్లే ఆప్స్ కు దూసుకు వెళ్ళింది రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు. ఇక ఇప్పటికే చెన్నై మరియు ఢిల్లీ కాపీటల్స్ ప్లే ఆప్స్ కు చేరిన సంగతి తెలిసిందే.