వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ప్రతిపక్ష నేత చంద్రబాబు….ఒక్కరోజు గ్యాప్ లేకుండా…వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే. నిత్యం ఏదొక అంశాన్ని తీసుకోవడం…జగన్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడం చేస్తున్నారు. అసలు జగన్ పాలనలో జనాలు నానా కష్టాలు పడిపోతున్నారనే స్థాయిలో టిడిపి ప్రచారం చేస్తూ వస్తుంది. కానీ వాస్తవ పరిస్తితులు వేరుగా ఉన్నాయని స్థానిక ఎన్నికలు రుజువు చేశాయి.
అయినా సరే బాబు తన ప్రయత్నాలు విరమించుకోవడం లేదు….జగన్‌ని ఎలాగైనా నెగిటివ్ చేయాలని చూస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో రాష్ట్రంలో వైసీపీ దుష్ట పరిపాలనను నిరసిస్తూ త్వరలో ఒక ప్రజాయాత్రను చేపట్టబోతున్నట్లు బాబు ప్రకటించారు. అంటే ప్రజయాత్ర అంటే….పాదయాత్ర లేక బస్సు యాత్ర…సైకిల్ యాత్ర అనేది క్లారిటీ లేదు. కానీ టిడిపి తరుపున జనాల్లోకి మాత్రం వెళ్లనున్నారని తెలుస్తోంది.
ఇక ఈ యాత్ర చంద్రబాబు చేస్తారా లేక నారా లోకేష్ చేస్తారనేది మాత్రం క్లారిటీ లేదు. ఇద్దరిలో ఎవరు యాత్ర చేస్తారనేది తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ తాను ఐదేళ్ల పాటు రాష్ట్రాన్ని ఉద్ధరించానని, అయితే జగన్ వల్ల తన ఐదేళ్ల శ్రమ బూడిదలో పోసిన పన్నీరు అయిపోయిందని అంటున్నారు. ఆనాటి పనులన్నింటినీ నాశనం చేసి, విధ్వంస పాలనకు జగన్ శ్రీకారం చుట్టారని, ఈ దుష్ట పాలనతో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని బాబు గారు సెలవిచ్చారు.
అందుకే ప్రజయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నట్లు బాబు చెప్పారు. కాకపోతే ఐదేళ్ల పాలన నచ్చకే కదా ప్రజలు జగన్‌ని గెలిపించుకున్నారు. ఒకవేళ జగన్ ఇప్పుడు దుష్టపాలన చేస్తే, స్థానిక ఎన్నికల్లో వైసీపీని ఆ స్థాయిలో గెలిపించరు కదా…మరి బాబు ఆ లాజిక్‌లు మరిచిపోయి తనని తాను ఎక్కువ ఊహించుకుంటున్నట్లు కనిపిస్తోంది.