కొత్త బైక్ లాంచ్ చేసిన రాయల్ ఎన్ ఫీల్డ్.. అదిరిపోయింది..!

ప్రస్తుతం రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అంటే మార్కెట్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మార్కెట్లోకి ఎన్ని కొత్త బైక్ లు వచ్చినా సరే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కి ఉన్న క్రేజ్ ఏ మాత్రం తగ్గదు. ఎంత ధర వెచ్చించి అయినా సరే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు. ఇక వినియోగదారుల అభిరుచులకు తగ్గట్టు గానే రాయల్ ఎన్ఫీల్డ్ కూడా కొత్త వర్షన్లను మార్కెట్లోకి తీసుకు వస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే.

ఇటీవలే రాయల్ ఎన్ఫీల్డ్ మరో కొత్త బైక్ విడుదల చేసింది. మిటీయార్ 350 మోడల్ ఆ కంపెనీ తాజాగా లాంచ్ చేసింది. 349 సిసి ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ బిఎస్ 6 ఇంజిన్ తో .. ఏకంగా ఏడు రంగుల్లో కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చింది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. ప్రస్తుతం ఎంతో మందిని ఆకర్షిస్తుంది అని చెప్పాలి. ఇక ఈ సరికొత్త బైక్ లో బ్లూటూత్ కనెక్టువిటీ తో పాటు ఎస్ఈడీ స్క్రీన్ లాంటి అత్యాధునిక ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇక ఎంతో మంది ఈ బైక్ ఎప్పుడెప్పుడు లాంచ్ అవుతుందా అని ఎదురు చూడక ఇప్పుడు లాంచ్ అవ్వడంతో బైక్ కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతున్నారు.