మాట నిలబెట్టుకున్న జక్కన్న..RRR సెలబ్రేషన్స్‌లో రాజమౌళి ‘నాటు’ స్టెప్పులు..

-

మాస్టర్ స్టోరి టెల్లర్ రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ ఫిల్మ్ రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం విడుదల ముందు రోజు వరకు జక్కన్న ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో చిత్ర విడుదల తర్వాత ‘నాటు నాటు’ స్టెప్పులు వేయాలని రాజమౌళిని యాంకర్ అడిగారు. దానికి ఓకే చెప్పిన జక్కన్న.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు.

RRR సెలబ్రేషన్స్ లో భాగంగా రాజమౌళి దర్శకుడు అనిల్ రావిపూడితో కలిసి ‘నాటు నాటు’ పాటకు స్టెప్పులేశాడు. జూనియర్ ఎన్టీఆర్ వీరిరువురికి యాక్షన్ చెప్పగా, రామ్ చరణ్, దిల్ రాజు, ఇతర మూవీ యూనిట్ సభ్యులు రాజమౌళి స్టెప్పులకు ఈలల కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.

బాక్సాఫీసు వద్ద సత్తా చాటుతున్న ఈ చిత్రాన్ని చూసి ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఫిల్మ్ నైజాం డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు కాగా, వీరు తాజాగా సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇందులో మూవీలో హీరోలుగా నటించిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పాల్గొన్నారు. రామ్ చరణ్ వైఫ్ ఉపాసన, జూనియర్ ఎన్టీఆర్ వైఫ్ ప్రణతి కూడా ఈ సెలబ్రేషన్స్ లో భాగమవడం విశేషం. మొత్తంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిందని చెప్పొచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version