ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఏపీ సీఎం జగన్ రెండు రోజుల పాటు ఢిల్లీలోనే ఉండనున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి షా తో ఏపీ సీఎం జగన్ సమావేశం కానున్నారు. నేడు సాయంత్రం 4 : 30 గంటలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర సహకారంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.
అలాగే ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కొత్త జిల్లాల ఏర్పాటు జరిగిన విషయం తెలిసిందే. సోమవారం నుంచే కొత్త జిల్లాల పాలన ప్రారంభం అయింది. దీని పై కూడా ప్రధాన మంత్రి మోడీతో ఏపీ సీఎం జగన్ చర్చించే అవకాశం ఉంది. దీని తో పాటు పోలవరం ప్రాజెక్ట్ గురించి కూడా ప్రధాని మోడీతో ప్రస్తావించే అవకాశం ఉంది.
ముఖ్యంగా మూడు రాజధానుల విషయంపై సహకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కోరే ఛాన్స్ ఉంది. కాగ ఇటీవల అసెంబ్లీ వేదికగా తమ ప్రభుత్వం త్వరలోనే మూడు రాజధానులను తీసుకువస్తుందని జగన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే విభజన హామీలపై కూడా చర్చించే అవకాశం ఉంది.