RRR: సినిమా ఎన్ని కోట్లు లాభమా తెలుసా..?

-

డైరెక్టర్ రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం RRR . ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సృష్టించింది. ఈ చిత్రం మార్చి 25న థియేటర్లలో విడుదలై ప్రపంచవ్యాప్తంగా రూ.1118 కోట్ల రూపాయలు రాబట్టినట్లుగా ట్రేడ్ వర్గాలు తెలియజేశాయి. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో దాదాపుగా రూ.265.65 కోట్ల రూపాయల షేర్ తో రూ.394 కోట్ల రూపాయలు వసూలు చేసింది కేవలం ఒక్క నైజాం లోనే దాదాపుగా రూ.112 కోట్ల రూపాయల కలెక్షన్ చేసినట్లుగా సమాచారం ఇగ తెలుగు రాష్ట్రాలలో డిస్ట్రిబ్యూటర్లకు లాభాలను కూడా తెచ్చిపెట్టింది.

RRR ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే..

1). నైజాం-111.80 కోట్ల రూపాయలు.
2). సీడెడ్-46 కోట్లు.
3).UA-35.50 కోట్లు.
4). నెల్లూరు-10.50 కోట్లు.
5). గుంటూరు-18.10 కోట్లు.
6). కృష్ణ-14.70 కోట్లు.
7). వెస్ట్-13.25 కోట్లు.
8). ఈస్ట్-15.80 కోట్లు.
9). ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మొత్తం కలెక్షన్ల విషయానికి వస్తే.. రూ.265.65 కోట్ల రూపాయలు.
10). కర్ణాటక-43 కోట్ల రూపాయలు.
11). తమిళనాడు-42.4 కోట్ల రూపాయలు.
12). కేరళ-10.6 కోట్ల రూపాయలు.
13). నార్త్-126 కోట్ల రూపాయలు.
14). ఓవర్సీస్-95 కోట్ల రూపాయలు.
15). ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల విషయానికి వస్తే రూ.582.65 కోట్ల రూపాయలు రాగ మొత్తంమీద రూ.1117.30 కోట్ల రూపాయల గ్రాస్ ను కొల్లగొట్టి నట్లు తెలుస్తోంది.

ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించారు. ఈచిత్రంలో ఆలియాభట్, ఒలీవియా మోరిస్, శ్రీయ, అజయ్ దేవగన్, సముద్రఖని ఇతరు లు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాని డి.వి.వి.దానయ్య భారీ బడ్జెట్తో తెరకెక్కిన డం జరిగింది. ఎం.ఎం.కీరవాణి సంగీతాన్ని అందించారు. ఇప్పుడు తాజాగా ఓ టి టి లో విడుదలైన ఈ చిత్రం అద్భుతమైన స్పందన లభిస్తోంది. ఏది ఏమైనా రాజమౌళి ఏదైనా సినిమా తెరకెక్కిస్తే ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని అందిస్తుందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news