RRR..‘దోస్తీ’ సాంగ్ ఫుల్ వీడియో వచ్చేసింది..ఒకే ఫ్రేమ్‌లో రామ్ చరణ్, తారక్

-

మాస్టర్ స్టోరి టెల్లర్ రాజమౌళి తెరకెక్కించిన RRR రికార్డు స్థాయిలో వసూళ్లు సాధించింది. ఈ చిత్రం నుంచి మరో సాంగ్ వీడియో రిలీజ్ చేశారు మేకర్స్. గురువారం సోషల్ మీడియా వేదికగా ‘దోస్తీ’ సాంగ్ వీడియో విడుదల చేయగా, ఇందులో స్నేహితులుగా రామ్ చరణ్, తారక్ ఒకే ఫ్రేమ్ లో  కనబడుతారు.

ఇటీవల ‘నాటు నాటు, కొమ్మ ఉయ్యాల ’ పాట వీడియోలు రిలీజ్ చేసిన మూవీ మేకర్స్..తాజాగా ‘దోస్తీ’ సాంగ్ వీడియో రిలీజ్ చేశారు. ఈ పాటకు సాహిత్యం దివంగత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అందించారు. కాల భైరవ ఈ పాట పాడారు. ఈ చిత్రం ఇటీవల రూ.1,000 కోట్ల క్లబ్ లో చేరిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ చిత్రంలో అల్లూ రి సీతారామరాజు పాత్రను రామ్ చరణ్ పోషించగా, కొమురం భీమ్ గా తారక్ నటించారు. రామ్ చరణ్ కు జోడీగా ఆలియా భట్., తారక్ సరసన ఒలివియా నటించగా, కీలక పాత్రలను సముద్రఖని, శ్రియా సరణ్, అజయ్ దేవగణ్ పోషించారు. ఎం.ఎం.కీరవాణి మ్యూజిక్ అందించగా, స్టోరిని రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అందించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version