న్యూస్ పేపర్లతో పెన్సిళ్ల తయారీ ..!

-

సాధారణంగా స్కూల్ పిల్లలు వాడే పెన్సిళ్ళన్నీ చక్కతో తయారయ్యేవే. ఏటా మన దేశంలోని సుమారు 20 నుంచి 25 బిలియన్ల పెన్సిళ్లు తయారవుతుంటాయి. కానీ ,  మన దేశంలో ప్రతి సంవత్సరం సుమారు 60,000 వేల చెట్లు పెన్సిళ్ల తయారీకే వినియోగిస్తున్నారు. అయితే ఈ మధ్యన ప్రజల్లో పర్యావరణ స్పృహ పెరుగుతుండడంతో తయారీ దారులు సైతం వినియోగదారులను ఆకట్టుకునేందుకు సరికొత్తగా రీసైక్లింగ్ పిన్సిల్స్ మార్కెట్ లోకి విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో వీటికి విపరీతమైన గిరాకీ ఉంది.

ఈ పెన్సిళ్లను సాధారణంగా న్యూస్ పేపర్ తో తయారు చేస్తుంటారు. న్యూస్ పేపర్లను గుజ్జుగా మార్చి , వాటి మధ్యలో గ్రాఫైట్ ను ఉంచి , బేక్ చేసి అరబెడతారు. అవి అరిపోయాక ప్యాకింగ్ చేసి మార్కెట్ లోకి విడుదల చేస్తారు. ఇలాంటి ప్రత్యామ్నాయాలు మార్కెట్ లోకి రావడం వల్ల పెన్సిళ్ల తయారీ కోసం కలప చెట్లను కూల్చకుండా ప్రకృతిని రక్షించుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version