త్రివిక్రం మీద ఆర్ ఆర్ ఆర్ తీవ్ర ప్రభావం ..?

-

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్‌. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా ఎన్టీఆర్ కొమరం భీమ్ గా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్‌కు జంటగా ఒలివియా మోరిస్, చరణ్‌కు జంటగా బాలీవుడ్ బ్యూటి అలియా భట్ నటిస్తోంది. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు చరణ్ పాత్ర ని టీజర్ ద్వారా రివీల్ చేశారు. ఈ రెండిటితో సినిమా మీద అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయి.

ఇక ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ త్రివిక్రం దర్శకత్వంలో నటిస్తాడన్న సంగతి తెలిసిందే. ఇంతకముందు అరవింద సమేత వీర రాఘవ సినిమా తో త్రివిక్రం ఎన్టీఆర్ ని మాస్ హీరోగా చూపించారు. ఈ సినిమా మంచి కమర్షియల్ సక్సస్ ను అందుకుంది. ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ తో తెరకెక్కించిన అల వైకుంఠపురములో సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దాంతో మళ్ళి త్రివివిక్రం మరోసారి ఎన్టీఆర్ తో సినిమా తెరకెక్కించబోతున్నారు. ఈ సినిమా ఎన్టీఆర్ కి 30 వ సినిమా కావడం విశేషం. ఈ సినిమా కి ఎప్పటిలాగే ‘అ’ సెంటిమెంట్ ని ఫాలో అవుతు ‘అయినను పోయిరావలె హసినకు’ అన్న టైటిల్ ని ఫైనల్ చేశారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా విషయం లో త్రివిక్రం కి బాగా ఒత్తిడి అనిపిస్తుందని సమాచారం. అందుకు కారణం ఆర్ ఆర్ ఆర్. ఈ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ సంపాదించుకోవడం ఖాయమని ఇప్పటికే ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. దాంతో ఇప్పుడు ఎన్టీఆర్ తో త్రివిక్రం తీసే సినిమా కూడా అదే స్థాయిలో ఉండాలని అంటున్నారట. ఇది ఒక రకంగా ఆర్ ఆర్ ఆర్ ప్రభావమనే చెప్పాలి. అందుకే త్రివిక్రం మళ్ళీ స్క్రిప్ట్ ని పాన్ ఇండియా స్క్రిప్ట్ గా తీర్చి దిద్దుతున్నారట. ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ ఆర్ ఆర్ తర్వాత అమాంతం ఎన్టీఆర్ రేంజ్ మారిపోతుంది కాబట్టి ఆ తర్వాత సినిమాలు కూడా ఇప్పటి నుంచి పాన్ ఇండియా లెవల్ లో ఉండేలా ప్లాన్ చేస్తున్నారట ఎన్టీఆర్.

Read more RELATED
Recommended to you

Latest news