RRR : ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తుండ‌గా గుండెపోటు.. అభిమాని మృతి

-

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ కలిసి న‌టించిన ఆర్ఆర్ఆర్ సినిమా నేడు పాన్ ఇండియా రెంజ్ లో విడుద‌ల అయిన విషయం తెలిసిందే. ప్రీమియ‌ర్ షోల‌ తో నిన్న రాత్రి నుంచే తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మేనియా న‌డుస్తుంది. మెగా, నందమూరి అభిమానుల్లో ఆర్ఆర్ఆర్ సినిమాతో పండగ వాతావ‌ర‌ణం నొల‌కొంది. అయితే పండ‌గ వాతావ‌ర‌ణంలో విషాదం అలుముకుంది. ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అనంత‌ర‌పూరం జిల్లాలో ఒక థీయేట‌ర్ లో ఆర్ఆర్ఆర్ చిత్ర ప్ర‌ద‌ర్శ‌న జ‌రుగుతుంది.

ఆర్ఆర్ఆర్ సినిమా చూస్తున్న ఓబులేసు అనే అభిమానికి గుండె పోటు వ‌చ్చింది. దీంతో ఓబులేసును చికిత్స కోసం ఆస్ప‌త్రికి త‌ర‌లించే లోపే మృతి చెందాడు. కాగ ఆర్ఆర్ఆర్ సినిమాను అంద‌రి కంటే ముందే చూడాల‌ని ఓబులేసు.. మొదటి షో కే త‌న స్నేహితుల‌తో క‌లిసి వ‌చ్చాడు. త‌న‌కు ఇష్టం అయిన సినిమాను పూర్తిగా చూడక ముందే.. గుండె పోటుకు గురి అయ్యాడు. ఆస్ప‌త్రికి తీసుకెళ్లే లోపే మ‌ర‌ణించాడ‌ని ఓబులేసు మిత్రులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news