OFFICIAL : “ఆర్ఆర్ఆర్” ఫాన్స్ కు బిగ్ షాక్.. మూవీ విడుదల వాయిదా..

-

ఆర్.ఆర్ ఆర్ చిత్ర బృందం సంచలన నిర్ణయం తీసుకుంది. జనవరి 7వ తేదీన విడుదల కావాల్సిన ఈ సినిమాను వాయిదా వేస్తున్నట్లు చిత్ర బృందం నిర్ణయం తీసుకుంది చిత్ర బృందం. ఓమిక్రాన్ వేరియంట్ కేసులు క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో… మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాలలో థియేటర్ల పై ఆంక్షలు విధిస్తున్న సంగతి తెలిసిందే.

థియేటర్లు మూతపడుతున్న నేపథ్యంలోనే తమ మూవీ విడుదల తేదీని మార్చుకుంటున్నట్లు ప్రకటించింది చిత్ర బృందం.  ఈ మేరకు ఓ పోస్టర్ కూడా విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీ ఈ ప్రకటన చేయడంతో ఫాన్స్ అందరూ నిరాశ చెందారు. గతం లోనూ ఇలాగే ఈ సినిమా వాయిదా పడి.. సంక్రాంతి బరిలో నిలిచింది. ఇప్పుడు కరోనా కేసులు మళ్ళీ పెరగడంతో.. పోస్ట్ పోన్ అయింది. కాగా ప్ర‌స్తుతం ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌లో చిత్ర యూనిట్ ఫుల్ బిజీగా ఉంది. పాన్ ఇండియా లెవ‌ల్ లో సినిమాను విడుద‌ల చేస్తుండ‌టంతో అన్ని భాష‌ల్లోనూ ప్ర‌మోష‌న్లు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news