పెద్దవాళ్ళు అంటే గౌరవమే లేదు..ఎన్టీఆర్ చాలా బ్యాడ్ బాయ్ : రాజమౌళి షాకింగ్ కామెంట్స్

-

ఆర్.ఆర్.ఆర్ ఈ సినిమా కోసం.. తెలుగు ప్రేక్షకులే కాకుండా… ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం ఈ సినిమా బృందం ప్రమోషన్ మూడ్ లో ఉంది. ఈ నేపథ్యంలోనే… నిన్న తమిళనాడు రాష్ట్రంలోని చెన్నై నగరంలో ఆర్ఆర్ అర్ మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్ కు.. సినిమా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హాజరయ్యారు.

అయితే ఈ సందర్భంగా.. జూనియర్ ఎన్టీఆర్ పై సెటైర్లు పేల్చారు ఎస్ ఎస్ రాజమౌళి. హీరో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల లో… ఎవరు మంచివారు అని రాజమౌళిని యాంకర్ అడిగింది. అయితే ఈ ప్రశ్న పై రాజమౌళి స్పందిస్తూ…”హీరో రామ్ చరణ్ చాలా మంచివాడు. అందరి పట్ల గౌరవం ఉన్నవాడు. కానీ జూనియర్ ఎన్టీఆర్ అలా కాదు. ఎప్పుడు గోల గోల చేస్తూ ఉంటాడు. పెద్దలు అంటే అస్సలు గౌరవం ఉండదు. ఎన్టీఆర్ చాలా బ్యాడ్ బాయ్.”అంటూ కామెంట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news