గడిచిన 24 గంటల్లో 6,531 కొత్త కేసులు నమోదు కాగా, 315 మరణాలు చోటుచేసుకున్నట్టు ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 75,481కు చేరుకోగా మృతుల సంఖ్య 4,79,997కు చేరుకున్నది. కొత్త వేరియంట్ కేసు సంఖ్య 578కు చేరుకోగా, 151 మంది కోలుకున్నారు అని ఆరోగ్య మంత్రిత్వశాఖ చెప్పింది.
ఢిల్లీలో 331 కొత్త కేసులు వెలుగు చూడగా, ఒకరు మృతిచెందారు. దేశంలో అత్యధిక ఒమిక్రాన్ కేసులు న్యూఢిల్లీ(142)లోనే నమోదయ్యాయి. ఆ తర్వాత మహారాష్ట్ర(141), కేరళ (57), గుజరాత్ (49), రాజస్తాన్ (43) ఒమిక్రాన్ కేసులు ఉన్నట్లు ఆరోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది.
దేశ రాజధానిలో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి అంటువ్యాధుల నియంత్రణ ప్రణాళికను అమలులోకి తీసుకువచ్చింది. ఇందులో భాగంగా సోమవారం రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూను అమలు చేసింది.