RRR: రామరాజు ఫర్ భీమ్.. టైం చెప్పేసాడు..

-

రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ పై భారీ అంచనాలు ఉన్నాయి. జూనియర్ ఎన్ టీ ఆర్, రామ్ చరణ్ లు హీరోలుగా చేస్తున్న ఈ భారీ మల్టీ స్టారర్ నుండి రామ్ చరణ్ లుక్ బయటకి వచ్చిన సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామరాజుగా కనిపించిన రామ్ చరణ్ లు ప్రేక్షకుల ఆదరణ పొందింది. ఇక అప్పటి నుండి కొమరం భీమ్ గా ఎన్ టీ ఆర్ ఎలా ఉంటాడో చూడాలన్న కుతూహలం అందరికీ ఎక్కువైంది.

 

ఐతే తాజా సమాచారం ప్రకారం కొమరం భీమ్ గా ఎన్ టీ ఆర్ లుక్ అక్టోబర్ 22వ తేదీన బయటకు రానుంది. కరోనా లాక్డౌన్ తర్వాత షూటింగ్ మొదలైన రోజే ఈ విషయాన్ని వెల్లడి చేసిన చిత్ర బృందం అన్నట్టు గానే లుక్ రివీల్ చేయడానికి సిద్ధమైంది. మరో రెండు రోజుల్లో కొమరం భీమ్ మీ ముందుకు వస్తున్నాడని చెబుతూ పోస్టర్లు రిలీజ్ చేసింది. 22వ‌ తేదీన ఉదయం 11 గంటలకు ఎన్ టీ ఆర్ లుక్ రిలీజ్ చేస్తారట. సో.. ఎన్ టీ ఆర్ అభిమానులు రికార్డులు క్రియేట్ చేయడానికి సిద్ధంగా ఉండాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news