ప్రపంచంలోని సినీ ప్రేక్షకులు అందరూ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రం కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఈ నెల 25న ఫిల్మ్ విడుదల కాబోతున్నది. కాగా, ఈ చిత్రాన్ని కర్ణాటకలో బాయ్ కాట్ చేయాలని నెటిజన్లు ట్విట్టర్ వేదికగా #BoycottRRRinKarnataka హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. దాంతో ఈ హ్యాష్ ట్యాగ్ మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. కన్నడిగులను దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అవమానిస్తున్నాడని, ఈ నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని కర్ణాటకలో నిషేధించాలని ట్విట్టర్ వేదికగా పలువురు ట్వీట్స్ చేస్తున్నారు.
చిత్రాన్ని కన్నడలో కాకుండా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారని, అందుకే తాము మూవీని బాయ్ కాట్ చేయాలని నిర్ణయించుకున్నామని కొందరు నెటిజన్లు వివరిస్తున్నారు. అయితే, ఈ విషయంలో రాజమౌళికి ఎటువంటి సంబంధం లేదని మరికొందరు రిప్లయి ఇస్తున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని కర్ణాటకలో డిస్ట్రిబ్యూట్ చేస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్ వారిని ఈ విషయమై అడగాలని సూచిస్తున్నారు. ఈ క్రమంలోనే తెలుగు వారు సైతం స్పందిస్తున్నారు.
ఒకవేళ ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని కర్ణాటకలో బ్యాన్ చేస్తే చేసుకోవచ్చని, కానీ, ‘కేజీఎప్ చాప్టర్ 2’ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విడుదల కాబోతుందన్న సంగతి మరిచిపోవద్దని కౌంటర్ ఇస్తున్నారు. కర్ణాటకలో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని కన్నడ భాషలో విడుదల చేయాల్సిన బాధ్యత కేవీఎన్ ప్రొడక్షన్స్ వారిపైన ఉంటుందని వివరిస్తున్నారు. కర్ణాటకలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని కన్నడ భాషలో విడుదల చేయాలని శాండల్ వుడ్ హీరో శివ రాజ్ కుమార్ రిక్వెస్ట్ చేశారని నెటిజన్లు తమ ట్వీట్స్‌లో పేర్కొంటున్నారు. మొత్తంగా కన్నడ భాషలో చిత్రం విడుదల చేయడం లేదని నెటిజన్లు చిత్రాన్ని బాయ్ కాట్ చేయాల్సిందేనంటూ హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు.