RRR : ఆర్ఆర్ఆర్ నుంచి బిగ్ అప్డేట్.. ట్రైలర్ డేట్ ఫిక్స్

-

వరల్డ్ వైడ్ గా… ఎంతో ఆసక్తిగా అందరూ చూస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. ఈ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నారు. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ సినిమా కోసం రెండు తెలుగు రాష్ట్రాల కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా కు టాలీవుడ్ సంచలన డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటి నటులు ఆలియాభట్ అజయ్ దేవగన్ కీలకపాత్రలో నటించిన సంగతి తెలిసిందే.

అయితే.. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదల అయిన పోస్టర్లు, టీజర్లు, సాంగ్స్‌ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఆర్‌ఆర్‌ఆర్‌ నుంచి మరో బిగ్‌ అప్డేట్‌ వచ్చింది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ తేదీని అధికారికంగా ప్రకటించింది చిత్రబృందం. డిసెంబర్ 9వ తేదీన ఉదయం 10 గంటలకు  ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయనున్నట్లు పోస్టర్ ను విడుదల చేసింది. కాగా డిసెంబర్ 3వ తేదీన ట్రైలర్ను విడుదల చేయాలనుకున్నా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా వేసుకుంది చిత్రబృందం. ఇది ఇలా ఉండగా జనవరి 7వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news