సిఎం జగన్ పై చంద్రబాబు ఒ రేంజ్ లో ఫైర్ అయ్యారు. గేటుకు గ్రీజు వేయలేని సీఎం మూడు రాజధానులు కడతారా..? అంటూ జగన్ పై ఫైర్ అయ్యారు. ఏడాది కాలంగా గేట్ రిపేర్ చేయించలేకపోయారని.. ప్రకృతి వైపరీత్యంలో ఖర్చు పెట్టాల్సిన రూ. 1100 కోట్లను నిధులను కూడా మళ్లించేశారని అగ్రహించారు. విశాఖలో ఎల్జీ పాలిమర్స్ తప్పిదం వల్ల చనిపోతే.. కోటి రూపాయలు నష్ట పరిహరం ఇచ్చారని మండిపడ్డారు.
వరద మృతుల కుటుంబాలకు కూడా రూ. కోటి నష్టపరిహరం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వరద నష్టంపై న్యాయ విచారణ జరిపించాలని.. బాధితులను కట్టడి చేసి వెంట పెట్టుకుని వెళ్లిన వారిని సీఎం జగన్ పరామర్శించారని విమర్శించారు. ఓటీఎస్ అమలు చేసే హక్కు ఈ సీఎంకు ఎవరిచ్చారు..? గత ప్రభుత్వాలు కట్టించిన ఇళ్లకు ఇప్పుడు ఈ సీఎం హక్కు ఇచ్చేదేంటీ..? అని నిలదీశారు. టీడీపీ వచ్చిన వెంటనే ఉచితంగా పట్టాలు ఇస్తామని.. ఎన్టీఆర్ వర్శిటీ వీసీని చూస్తోంటే బాధేస్తోందన్నారు. అంతగా బాధపడేకంటే రాజీనామా చేసి వెళ్లిపోవచ్చుగా..? అన్నారు.
పిల్లల ఫీజులను కూడబెట్టిన కార్పస్ ఫండును తీసేసుకుంటారా..? రోజూకో రూ. 1 చెల్లించి కూడబెట్టుకున్న అభయ హస్తం డబ్బులను గుంజుకుంటారా..? అని ప్రశ్నించారు. అనునిత్యం మడమ తిప్పుతూనే ఉంది ఈ ప్రభుత్వం… మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానన్న జగన్.. ఇప్పుడు మెడలు దించేశారని చురకలు అంటించారు. అన్నమయ్య ప్రాజెక్టు వద్దని అక్కడి ప్రజలు గగ్గోలు పెడుతున్నారని… ఇప్పుడు కాకున్నా.. 20 ఏళ్ల తర్వాతైనా మా పిల్లలు చనిపోతారని భయపడుతున్నారని పేర్కొన్నారు.