రూ. 371 కోట్లు అవినీతి జరగడం వాస్తవం: సీఐడీ చీఫ్

-

చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్ మెంట్ కేసులో గత శనివారం ఏపీ సిఐడి పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. టీడీపీ ప్రభుత్వం ఉన్న సమయంలో స్కిల్ డెవెలప్ మెంట్ కార్పొరేషన్ పేరు మీద రూ. 371 కోట్లు అవినీతి జరిగిందన్నది కేసులో కీలక విషయం. కానీ చంద్రబాబు ఎటువంటి అవినీతి చేయలేదని, ఆ సమాయంలో అందరి అనుమతులు తీసుకునే డబ్బును తరలించామని టీడీపీ తెలియచేస్తోంది. ఇవన్నీ వింటున్న ఏపీ సిఐడి చీఫ్ సంజయ్ తెలియచేస్తూ.. ఈ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో రూ. 371 కోట్లకు అవినీతి జరిగిన విషయం వాస్తవం అన్నారు, ఇందులో చాలా అంశాలు ముడిపడి ఉన్నాయని.. అప్పటి ప్రభుత్వం ఒప్పందం మరియు నిధుల విడుదల విషయంలో అధికారుల అభ్యంతరాలను అస్సలు పట్టించుకోకుండా నిర్ణయాలు తీసుకుందన్నారు. ముఖ్యంగా వీరు చేసుకున్న ఒప్పందానికి మరియు జీవో కు మధ్యన చాలా తేడాలు గుర్తించినట్లు సిఐడి చీఫ్ సంజయ్ పేర్కొన్నారు.

ఇలా రోజు రోజుకు ఏదో ఒక విషయం చంద్రబాబుకు వ్యతిరేకంగా సిఐడి చేస్తున్న ఆరోపణలను చూస్తే చంద్రబాబుకు బెయిల్ వస్తుందా అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news