చంద్రబాబు అరెస్ట్ చాలా బాధాకరం: తెలంగాణ మంత్రి

-

ఆంధ్రప్రదేశ్ సీనియర్ రాజకీయ నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో 18 రోజులు రిమాండ్ లో ఉన్నారు. బెయిల్ కోసం టీడీపీ నేతలు, లోకేష్ మరియు చంద్రబాబు తరపున లాయర్లు చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.. అయినప్పటికీ బెయిల్ రావడం లేదు అంటే కేసు ఎంత పటిష్టంగా ఉందన్నది ప్రజలు అర్ధం చేసుకుంటున్నారు. ఈ అరెస్ట్ ను ఏపీలో మరియు తెలంగాణాలో కొందరు నేతలు ఖండించారు. ఇక తాజాగా తెలంగాణ మంత్రి BRS నేత పువ్వాడ అజయ్ కుమార్ స్పందించారు. ఈయన మీడియా తో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేయడం చాలా బాధాకరం అన్నారు. అంతే కాకుండా అజయ్ మాట్లాడుతూ గవర్నర్ అనుమతి లేకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదంటూ తన అభిప్రాయాన్ని తెలియచేశారు. రాజకీయంగా కక్ష సాధించడం కోసం ఇటువంటి అరెస్ట్ లు చేయడం మంచి పద్ధతి కాదని వ్యతిరేకించారు పువ్వాడ అజయ్.

కాగా ఇప్పటికే బండి సంజయ్, హరీష్ రావు, కేటీఆర్ లు అరెస్ట్ పై స్పందించిన విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news