ఈ ప్రభుత్వ స్కీమ్ తో నెలకి రూ.5వేలు… అర్హతలు, కావాల్సిన డాక్యుమెంట్లు పూర్తి వివరాలు ఇవే..!

-

ఎన్నో స్కీమ్స్ ని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చారు. ఈ స్కీమ్స్ వలన చాలా బెనిఫిట్స్ ని పొందొచ్చు. అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్నారు. చిన్నారుల నుండి సీనియర్ సిటిజన్స్ వరకు చాలా పధకాలు వున్నాయి. అయితే వాటిలో వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా స్కీమ్ కూడా ఒకటి.

 

 

మరి ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… పేద, మధ్య తరగతి కుటుంబాల్లో సంపాదించే వ్యక్తులు శస్త్ర చికిత్సలు చేయించుకుని విశ్రాంతి తీసుకునే సమయంలో ఆ కుటుంబాలకి బాగా కష్టం అవుతోంది. రోజు గడవడం కూడా కష్టంగా వుండే పరిస్థితి కలుగుతోంది. అందుకే వీరి కోసం ఒక పథకాన్ని తీసుకువచ్చారు. అదే ఆరోగ్య ఆసరా స్కీమ్. ఈ స్కీమ్ 2019 డిసెంబర్‌ 2న ప్రారంభించారు.

ఇప్పటి వరకు లక్షల మందికి ఈ పథకం కింద ప్రయోజనం పొందుతున్నారు. వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా పథకం కింద శస్త్ర చికిత్సల అనంతరం వైద్యులు సూచించే విశ్రాంతి సమయానికి రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ. 5 వేలు ప్రభుత్వం అందిస్తోంది. ఈ పధకం 836 రకాల సర్జరీలకు వర్తిస్తుంది. ఈ స్కీమ్ కింద వచ్చే డబ్బులు డైరెక్ట్ బ్యాంక్ ఖాతాల్లోనే జమ అవుతాయి.

వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా స్కీమ్ కి కావలసిన అర్హతలు:

ఆంధ్రప్రదేశ్‌లోని శాశ్వత నివాసితులు అయ్యి ఉండాలి.
ఎస్సీ, ఓబీసీ, ఎస్సీ, మైనారిటీ వర్గాలకు చెందిన రిజర్వ్డ్ కేటగిరీలకి మాత్రమే ఇది.
లబ్ధిదారులు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఎంపిక చేసిన ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుంది.
బీపీఎల్ కుటుంబానికి చెందిన పేద కూలీలు మాత్రమే ఈ పథకానికి అర్హులు.

వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా స్కీమ్ కి కావాల్సిన డాక్యుమెంట్లు:

ఆధార్ కార్డు
రెసిడెన్స్ సర్టిఫికెట్
ట్రీట్‌మెంట్ డాక్యుమెంట్స్
డిస్‌చార్జ్ డాక్యుమెంట్లు
క్యాస్ట్ సర్టిఫికెట్
ఇన్‌కమ్ సర్టిఫికెట్.

 

Read more RELATED
Recommended to you

Latest news