భారత్ లో కూడా చైనా తరహా రాజకీయ వ్యవస్థ వస్తోంది: మాయావతి

-

బీజేపీ, ఆర్ఎస్ఎస్ భారతదేశంలో ‘కాంగ్రెస్ ముక్త్’ గా కాకుండా ‘ ప్రతిపక్ష ముక్త్’గా కూడా చేస్తోందని బీఎస్పీ పార్టీ అధ్యక్షురాలు మాయావతి విమర్శించారు. చైనా తరహా రాజకీయ వ్యవస్థలాగే… జాతీయ స్థాయి నుంచి గ్రామీణ స్థాయి దాకా ఒకే పార్టీ ఆధిపత్యం చెలాయిస్తోందని మాయావతి విమర్శించారు. 

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ఈ వ్యాఖ్యలు చేశారు ఆమె. మాయావతి ఎన్నికల్లో పోరాడలేదని… మేము కూటమిగా ఏర్పాటు చేద్ధాం అనే సంకేతాలు పంపినా ఆమె స్పందించలేదని రాహుల్ గాంధీ విమర్శించారు. కాన్షీరామ్ యూపీలో దళితుల హక్కుల కోసం పోరాడారని… కానీ మాయావతి కేంద్రం ఈడీ, సీబీఐ తో దాడులు చేయిస్తుందని భయపడి దళితుల కోసం పోరాడలేదని రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై మాయావతి కూడా అంతే స్థాయిలో స్పందించింది. రాహుల్ గాంధీ లాగా మా పార్టీ ప్రధాన మంత్రిని  బలవంతంగా కౌగిలించుకునే పార్టీ కాదని… ప్రపంచ వ్యాప్తంగా సరదాగా గడిపే పార్టీ కాదంటూ కాంగ్రెస్ ను విమర్శించింది.

 

Read more RELATED
Recommended to you

Latest news