ప్రముఖ మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్ తర్వాత అంత ఇమేజ్ ను సొంతం చేసుకున్న హీరో గా చలామణి అవుతున్నారు. విజయ్ ఎన్నో వైవిధ్యభరితమైన సినిమాలలో నటించి మాస్ ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటాడు అని చెప్పడంలో సందేహం లేదు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న విజయ్ మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇకపోతే ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ ఎస్. ఏ. చంద్రశేఖర్ వారసుడిగా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన విజయ్ తన తండ్రి దర్శకత్వంలోనే ఎన్నో చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు.
ఎస్ ఎ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన వెట్రీ అనే సినిమా ద్వారా 1984 లో చైల్డ్ ఆర్టిస్ట్ గా వెండితెరకు పరిచయమయ్యాడు. విజయ్ తల్లిపేరు శోభ.. ఈమె సినీ గాయని. ఇదిలా ఉండగా తన 18 సంవత్సరాల వయసులో హీరో విజయ్ ఒక సినిమాలో నటించడం ఏమాత్రం బాగలేదని ఇతడు హీరో ఎలా అవుతాడు అని అందరూ చాలా అవమానించారట. అంతేకాదు ఈ సినిమాలో ఏమాత్రం పనికి రాడు అంటూ జోస్యం కూడా చెప్పారట. ఇక ఏమాత్రం అసహనం వ్యక్తం చేయకుండా తనలోని టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంటూ ప్రస్తుతం వంద కోట్ల పారితోషికం తీసుకునే స్థాయికి చేరుకున్నాడు విజయ్.ఇక తాజాగా కోలీవుడ్లో బీస్ట్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు పాన్ ఇండియా రేంజ్ లో వచ్చినా.. ఈ సినిమా మాత్రం ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ కలెక్షన్ల పరంగా మంచి విజయం సాధించిందని చెప్పవచ్చు. ఇకపోతే తెలుగులో నేరుగా ఈసారి దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు విజయ్. ఇక ఈ సినిమా కోసం ఆయన ఏకంగా 100 కోట్ల రూపాయలను పారితోషికంగా తీసుకుంటున్నట్లు సమాచారం. మొదటి పారితోషికం ఎంత అనే విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఆయన తన పది సంవత్సరాల వయసులో వెట్రి అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించినందుకు గాను 500 రూపాయలను పారితోషికంగా ఇచ్చారట. అలా ఐదు వందల తో మొదలైన తన సినీ ప్రస్థానం నేడు రూ. 100 కోట్లు తీసుకునే స్థాయికి చేరింది అని చెప్పవచ్చు.