గణేష్ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇక ప్రతి ఒక్కరు తమ ఇళ్ళకు గణేషుడి విగ్రహాలను తీసుకురావడంతో పండుగను ప్రారంభిస్తారు. విభిన్న శైలులతో తయారు చేయబడిన ఈ విగ్రహాలు చాలా అందంగా ఉంటాయి. అలాగే వాటిలో కొన్ని ఎక్కువ ఖరీదైనవి కూడా ఉంటాయి. ఈ క్రమంలోనే ఓ భక్తుడు 500 కోట్లు విలువ చేసే ఖరీదైన గణేషుడి విగ్రహం ఏర్పాటు చేశారు. భారత్ లోని గుజరాత్ రాష్ట్రంలో ఉన్న సూరత్ నగరంలోని ఒక వ్యాపారవేత్త తన ఇంట్లో ఈ విగ్రహాన్ని స్థాపించి ఘనంగా వేడుకలు మొదలు పెట్టాడు.
ఆ వ్యాపారవేత్త పేరు రాజేష్ భాయ్ పాండవ్. అతను డైమండ్ వ్యాపారంలో టాప్ బిజినెస్‌మేన్. తన ఇంట్లో పూజించే గణేషుడి విగ్రహం డైమెండ్‌తో చేసినది. ఈ అతిపెద్ద గణేషుడి డైమండ్ విగ్రహం 27.24 క్యారెట్ మేలిమి వజ్రం విశేషం. ఇక దీని పొడవు 24 మిల్లీమీటర్లు వెడల్పు 17 మిల్లీమీటర్లుగా ఉంది. దీని ధర సుమారు రూ. 500 కోట్లు. ఈ క్రమంలోనే రాజేష్ భాయ్ తన ఇంట్లో ఉన్న విగ్రహం మొత్తం భారతదేశంలో అత్యంత ఖరీదైన విగ్రహం అని పేర్కొన్నాడు.
ఈ విగ్రహం యొక్క విలువ అమూల్యమైనందున ద్రవ్య పరంగా కొలవలేమని రాజేష్ భావిస్తున్నాడు. అయితే బాగా ఖరీదైనవి కావడంతో దీన్నిచూడడానికి అందరికీ అనుమతి లేదు. రెండు రోజులు గణేషుడికి పూజా చేసి తాపీ నది నీళ్లు చల్లి సేఫ్‌గా లాకర్ పెడతారట. వాస్తవానికి రాజేష్ భాయ్ యంబూజీ గన్లులో దొరికిన సానపెట్టని ఈ వజ్రాన్ని దక్షిణాఫ్రికాలో 2005 ఒక వేలం పాటలో 29,000 లకు కొన్నారు. అతడికి ఈ వజ్రం గణేషుడి ఆకారలో కనపడడంతో.. దానికి మరింత మెరుగులు అద్ది ప్రతి సంవత్సరం ఆరాధిస్తున్నాడు.