తెలంగాణ పోలీస్ అంటే రాజకీయ కక్ష్యలకు వేదిక అయింది : ప్రవీణ్ కుమార్

-

సంవత్సరం కాలంలో శాంతి భద్రతల పై ఇవాళ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. తెలంగాణ వచ్చినప్పటి నుండి 2023 చివరి వరకు ఎంతో మంది మాటలు ,అంచనాలను పటాపంచలు చేస్తూ నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చారు. శాంతిభద్రతల విషయంలో కేసీఆర్ మొదటి నిర్ణయం లోనే 700 కోట్ల రూపాయల నిధులు ఇచ్చారు అని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ .ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. దేశంలోనే శాంతిభద్రతల విషయంలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రం నిలిచింది. నిన్న డిజిపి గారు వార్షిక మీడియా సమావేశంలో డిజిపి అన్ని అంశాలు చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు రాష్ట్రానికి హోమ్ మంత్రి లేడు. ఇద్దరు డిజిపిలు మారారు.అప్పుడు ఉన్న అధికారులే ఇప్పుడు ఉన్నారు. పోలీస్ నియామకాలు దాదాపు ఎస్సైలు,కానిస్టేబుల్ 40 వేల నియామకాలు చేపట్టారు.

ఒక్క సంవత్సరం లోనే శాంతిభద్రతల ఇంత దారుణంగా క్షిణించాయి. నిన్న డీజీపీ కొన్ని లెక్కలు మాత్రమే మీడియా ముందు పెట్టారు. జగిత్యాల లో పెట్రోల్ బంక్ లో పోలీస్ లపై కాంగ్రెస్ వాళ్లు దాడి చేస్తే కూడా కేస్ పెట్టలేని పరిస్థితి ఉంది. మీడియా లో సోషల్ మీడియాలో పొలిస్ లపై వార్తలు రావడంతో అప్పుడు జగిత్యాల ఎస్పీ కేస్ నమోదు చేశారు. డబ్బుల కోసం హత్యలు 40 శాతం పెరిగాయి.అత్యాచారాలు పెరిగాయి. 82 శాతం 18 సంవత్సరాల లోపు ఉన్న మహిళలపై అత్యాచారాలు పెరిగాయి.గంజాయి స్మగ్లింగ్ పెరిగింది. ఎక్కడ పోయారు. తెలంగాణ పోలీస్ అంటే రాజకీయ కక్ష్యలకు వేదిక అయింది అని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version