బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓఆర్ఆర్ టోల్ లీజ్ విషయంలో అవకతవకలు జరిగాయని.. కేసీఆర్, కేటీఆర్ లపై బీసీ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో ఈడీ కి ఫిర్యాదు చేశారు. గత ప్రభుత్వం ఓఆర్ఆర్ ను ఐఆర్ బీ సంస్థ కు లీజుకు ఇచ్చినందుకు ఐఆర్ బీ సంస్థ బీఆర్ఎస్ పార్టీ ఎలక్ట్రోలర్ బాండ్ల రూపంలో ముడుపులు తీసుకున్నదని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై బీసీ పొలిటికల్ జేఏసీ చైర్మన్ రాచాల యుగంధర్ మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఓఆర్ఆర్ టోల్ లీజ్ లో కోట్లాది రూపాయలు అవకతవకలు జరిగాయన్నారు.
ఏప్రిల్ 2023లో ఐఆర్బీ అనే సంస్థకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఓఆర్ఆర్ ను 30 ఏళ్లకు లీజుకు ఇచ్చిందని.. దీనికి బదులుగా జులై 2023 లో ఐఆర్బీ సంస్థ నుంచి రూ.25కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్లు కొనుగోలు చేసారని తెలిపారు. బీఆర్ఎస్ పాలనలో క్విడ్ ప్రోకోతో ఎంక్వైరీ చేసిందని.. ఇప్పుడు కూడా ఓఆర్ఆర్ అవకతవకలపై ఎంక్వైరీ వేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.