తెలంగాణ ప్రజలపై మరో పిడుగు..త్వరలో ఆర్టీసి, కరెంట్ చార్జీల మోత..!

-

తెలంగాణ ప్రజలపై కరెంట్ చార్జీలు, ఆర్టీసీ బస్ చార్జీల భారం పెరగనుంది. త్వరలోనే ఆర్టీసి చార్జీలను, విద్యుత్ చార్జీలను పెంచాలని రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆర్టీసి, విద్యుత్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించిన సీఎం కేసీఆర్ వచ్చే కేబినెట్ భేటీలో చార్జీల పెంపుపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. అయితే ఇందులో భాగంగా ఆర్టీసి చార్జీలను 10 నుండి 20 శాతం వరకు పెంచబోతునట్టు తెలుస్తోంది.

cm kcr | సీఎం కేసీఆర్
cm kcr | సీఎం కేసీఆర్

ఇక చివరి సారిగా ఆర్టీసి చార్జీలను 2019 డిసెంబర్ నెలలో పెంచారు. కనీస చార్జిని రూ.5 నుండి 10 కి పెంచారు. ఇక ఇప్పుడు మరోసారి పెంచనున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో విద్యుత్ చార్జీలను ఆరేళ్ల క్రితం పెంచారు. ఇప్పుడు మరోసారి పెంచాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే కరోనా ఎఫెక్ట్ తో నిత్యావసరాల ధరలు, ఇందనాల ధరలు పెరిగి సామాన్యుడు నలిగిపోతున్నారు. ఇప్పుడు సర్కార్ తీసుకున్న నిర్ణయం తో సామాన్యుడిపై మరింత భారం పెరగనుంది.

Read more RELATED
Recommended to you

Latest news