ఉద్యోగాలు వదిలేస్తున్న ఆర్టీసి కార్మికులు…? ఊళ్లకు వెళ్ళిపోతున్నారా…?

-

ఆర్టీసి సమ్మె మొదలై 40 రోజులు అవుతుంది. ఈ విషయంలో ప్రభుత్వంగాని ఆర్టీసి యాజమాన్యం గాని ఒక్క అడుగు అంటే ఒక్క అడుగు కూడా ముందుకి వేయలేదు. కోర్ట్ ని ఆశ్రయించడం మినహా వచ్చిన ఫలితం అంటూ ఏది లేదు… మాకు అన్ని నేరవేర్చకపోయినా కొన్ని అయినా నెరవేర్చండి అంటూ ఉద్యోగులూ అనడం లేదు, మేము అన్నీ కాకపోయినా కొన్ని అయినా నెరవేరుస్తామని ప్రభుత్వమూ అనడం లేదు. ఫలితం ఉద్యోగులు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడింది. వేలాది మంది ఉద్యోగులు ఇప్పుడు రోడ్డున పడ్డారు.

పిల్లల చదువులు, పిల్లల పెళ్ళిళ్ళు, కుటుంబ పోషణ, బ్యాంకు రుణాలు, ఇతర అప్పులు, పలు నిర్మాణాలలో ఉండటం, వంటివి ఇప్పుడు ఉద్యోగులకు పెను భారంగా మారాయి. దీనితో ఉద్యోగులు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించే దిశగా అడుగులు వేస్తున్నారు. ఉద్యోగ అవకాశాల కోసం వెతికేవాళ్ళు వెతుకుతుంటే, ఊరు వెళ్ళిపోయి వ్యవసాయ౦ చేసుకుందామని ఆలోచించే వాళ్ళు మరికొందరు. ఇక కొత్త ఉద్యోగాల్లో జాయిన్ అవుతూ ఆర్టీసి ఉద్యోగానికి రాజీనామా చేసే ఆలోచనలో వేలాది మంది ఉద్యోగులు ఉన్నారు.

ఇప్పుడు ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది అనేది చెప్పలేని పరిస్థితి. దీనితో దాదాపుగా ఉద్యోగుల్లో 60 శాతం మంది ఇతర ఉపాధి మీద పడినట్టు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ సిటి బస్సుల్లో పని చేసే ఉద్యోగులకు ఇప్పుడు ప్రభుత్వం మెట్రో మీద ఆధారపడి, సెట్విన్ సర్వీసుల మీద ఆధారపడి తమను వదిలేస్తే పరిస్థితి ఏంటి అనే ఆందోళన ఉంది. దీనితో వారిలో ఎక్కువ మంది హైదరాబాద్ లో ఉపాధి వెతుక్కోవడం, ప్రైవేట్ బస్సులకు వెళ్ళడం, మరికొంత మంది ఊళ్లకు వెళ్ళిపోయి పొలం పనులు చేసుకోవడం వంటివి చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news