తెలంగాణ ఆర్టీసీ ప్రయాణీకులకు గుడ్ న్యూస్ చెప్పింది. లగ్జరీ మరియు మెట్రో బస్సులను జిల్లాలకు తరలించాలని ఆర్టీసీ నిర్ణయం తీసకుంది. రాజధాని పేరుతో ఈ బస్సలను జిల్లాలకు నడపనున్నారు. ఏసీ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు మినహా ఇతర బస్సులన్నింటినీ జిల్లాలకు తరలించే ఆలోచనలో తెలంగాణ ఆర్టీసీ ఉంది. అక్టోబర్ 1 నుండి మంచిర్యాల, హనుమకొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ జిల్లాలకు 50 బస్సు సేవలను అందించబోతున్నారు.
అంతే కాకుండా సోమవారం నుండి నిర్మల్, కరీంనగర్, నిజామాబాద్, భద్రాచలం జిల్లాలకు కూడా ఈ బస్సు సేవలను అందించనున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్ నుండి ఈ జిల్లాలకు బస్సు సేవలు ఉన్నాయి. కానీ పండగలు వస్తే మాత్రం ప్రయాణీకులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా దసరా, రాఖీపండగ, దీపావళి పండగల వేళల్లో అధిక రద్ధీ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే పలు బస్సులను రాజధాని బస్సులుగా మార్చాలని నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది.