సమంత నాగ చైతన్యలకు కరోనా…? భయంలో అభిమానులు..!

-

rumors spreading on chaysam effected with corona
rumors spreading on chaysam effected with corona

ప్రపంచాన్ని చిన్నాబిన్నం చేస్తున్న కరోనా ఏ ప్రాంతాన్ని ఎవ్వరినీ వదలడం లేదు. రోజు కూలీ నుండి అన్నీ జాగ్రత్తలు తీసుకునే సెలబ్రిటీలు సైతం అందరూ కరోనా భారీన పడుతున్నారు, కరోనా నుండి తప్పించుకోలేకపోతున్నారు. తాజాగా టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేశ్ కి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. ఇక ఇదే తరహాలో టాలీవుడ్ లోని ప్రముఖ నటులు హీరో నాగ చైతన్య కి ఆయన భార్య స్టార్ హీరోయీన్ సమంత కి కూడా కరోనా సోకిందేమో అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సమంత నిత్యం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటారు, ఇక తాను తాజాగా తన ఫ్రెండ్ ఫ్యాషన్ డిజైనర్ శిల్పకి బుగ్గపై ముద్దు పెడుతూ ఉన్న ఓ ఫోటోను ఇంస్టాగ్రమ్ లో పోస్ట్ చేశారు. ఈ ఫోటో పోస్ట్ చేసిన కొన్ని రోజులకే శిల్పకి కరోనా పాజిటివ్ అని తేలింది. శిల్పకి ఒక్కసారిగా కరోనా అని తేలడంతో సమంత కు చైతన్యకు కూడా కరోనా వచ్చిందేమో అని అభిమానులు భయపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news