కేసీఆర్ కు ఇక్కడ విమర్శలు, అక్కడ ప్రశంసలు… టార్గెట్ మోడీ?

-

కేసీఆర్ తో కాంగ్రెస్ పార్టీ చిత్రమైన రాజకీయాలు చేస్తుందనడానికి తాజా ఉదాహరణ ఒకటి వెలుగులోకి వచ్చింది! రాష్ట్రంలో కేసీఆర్ పేరు చెబితే ఒంటికాలిపై లేస్తుంటారు కాంగ్రెస్ పార్టీ నేతలు.. ఇక రేవంత్ రెడ్డి లాంటి వారి సంగతైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. “టార్గెట్ కేసీఆర్ & ఫ్యామిలీ” అనే మిషన్ కి ఆయనే సృష్టి”కర్త”, కర్మ, క్రియ అన్నరేంజ్ లో దూకుపోతుంటారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అలా ఉంటే… ఢిల్లీ నుంచి మాత్రం కేసీఆర్ పై పొగడ్తల వర్షాలు కురుస్తున్నాయి.

cm kcr to meet colonel santosh babu home

వివరాళ్లోకి వెళ్తే… చైనాతో ఉద్రిక్తతల కారణంగా మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి సీఎం కేసీఆర్ ఆర్థిక సాయాన్ని అందజేశారు. ముందుగా ఇచ్చిన మాట ప్రకారమే…కల్నల్ సంతోష్ భార్య సంతోషికి రూ.5 కోట్ల చెక్కుతో పాటు డిప్యూటీ కలెక్టర్ జాబ్ ఆఫర్ లెటర్ ను అందజేశారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్న దశలో… కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వి స్పందించారు. ఇప్పుడు ఆయన స్పందించిన తీరే హాట్ టాపిక్!

కాంగ్రెస్ పెద్దలకు సన్నిహితుడనే పేరున్న ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు అభిషేక్ సింఘ్వి ట్విట్టర్ లో స్పందించారు. కల్నల్ సంతోష్ భార్య సంతోషికి తెలంగాణ సర్కార్ డిప్యూటీ కలెక్టర్ నియామక పత్రాన్ని అందజేసిందని.. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాంటి విధానాన్ని అనుసరించాలని ఎంపీ అభిషేక్ సింఘ్వి అభిప్రాయపడ్డారు. తెలంగాణ సీఎం కేసీఆర్ దివంగత సైనికుడి కుటుంబాన్ని ఆదరించిన తీరును ప్రశంసించారు. తెలంగాణ ఫాలో అవుతున్న విధానాన్ని ఇతర రాష్ట్రాలు కూడా అనుసరించాలని సింఘ్వి తన ట్వీట్లో అభిప్రాయపడ్డారు.

మొత్తంగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే విరుచుకుపడుతుంటే… ఢిల్లీ కాంగ్రెస్ ముఖ్య నాయకుడు మాత్రం కేసీఆర్ విధానాలు దేశానికే ఆదర్శం అని ప్రశంసించడం విశేషం. ఇక్కడ మరో విషయం ఏమిటంటే… కేసీఆర్ పేరుచెప్పి ఆయన మోడీకి కూడా క్లాస్ పీకినట్లేనని మరికొన్ని విశ్లేషణలు వెలుగులోకి వస్తున్నాయి.

ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి కంటే రాష్ట్ర ముఖ్యమంత్రే సూపర్ గా స్పందించారని చెప్పడం అభిషేక్క్ సింఘ్వీ ఉద్దేశ్యం అవ్వొచ్చు! ఈ క్రమంలో కేసీఆర్ ని పొగుడుతున్నట్లు పొగుడుతూనే… ఆయన పేరుచెప్పి మోడీకి చురకలు వేసినట్లు అయ్యిందని, మోడీ – కేసీఆర్ బంధానికి ఈ విమర్శలేమీ ఇబ్బందులు తేవు కానీ… కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆ దిశగా ఒక ప్రయత్నం అయితే చేసిందని మరికొందరి అభిప్రాయం!

Read more RELATED
Recommended to you

Latest news