రష్యా వ్యాక్సిన్‌కు నో చెప్పిన బ్రెజిల్‌.. ఎందుకోమరి..?

-

కరోనా కట్టడికి రష్యా తయారు చేసిన వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌–వీ అత్యవసర వినియోగానికి బ్రెజిల్‌ నో చెప్పింది. టీకా తయారీలో రష్యా అనుమతికి కావాల్సిన సమాచారం ఇవ్వలేదని బ్రెజిల్‌ జాతియా ఆరోగ్య నిఘా సంస్థ అన్విసా వెల్లడించింది. టీకా వినియోగానికి అనుమతి ఇవ్వాలని రష్యాన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) సంయుక్తంగా పని చేస్తున్న యునియావో క్విమికా అక్కడి ప్రభుత్వాన్ని అనుమతి కోరింది. అయితే..చైనాకు చెందిన సినోవాక్‌ ఆక్స్‌ఫర్డ్‌–ఆస్ట్రాజెనెకా తయారు చేసిన కోవిషీల్డ్‌ టీకాలకు మాత్రం బ్రెజిల్‌ ఓకే అనేసింది.


రష్యా రూపొందించిన స్పుత్నిక్‌–వీ చివరి దశ ప్రయోగాలకు పూర్తి అనుమతులు లేవని అన్విసా పేర్కొంది. దీనికి తోడు టీకా తయారీలో అత్యాధునికి సాంకేతికతను వినియోగించడంలోనూ పలు అనుమానాలు ఉన్నాయని తదితర కారణాలతో అనుమతులు ఇవ్వలేకపోతున్నామని పేర్కొంది. ఇది ఇలా ఉండగా డిసెంబర్‌ నెలలోనే వ్యాక్సిన్‌ యొక్క మూడో దశ ట్రయల్స్‌కు క్విమికా దరఖాస్తు చేసుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. బ్రెజిల్‌లో రోజురోజుకు పెరుగుతున్న కరోనా వ్యాప్తితో వ్యాక్సిన్‌కు త్వరిగతిన అనుమతి ఇవ్వాలని అక్కడి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news