ఇండియా తన మిత్ర దేశం రష్యాకు షాక్ ఇచ్చింది. యూఎన్ భద్రతామండలిలో రష్యా ప్రవేశపెట్టిన తీర్మాణంపై తటస్థ వైఖరిని అవలంభించింది. రష్యా ప్రవేశపెట్టిన తీర్మాణానికి గైర్హాజరు అయింది. ఐరాస భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశం, వీటో విల్డింగ్ కౌన్సిల్ సభ్య దేశం అయిన రష్యా తన తీర్మాణానికి మద్దతు ఇవ్వాల్సిందిగా భద్రతా మండలిలోని 15 దేశాలను కోరింది. ఉక్రెయిన్ క్రైసిస్ పై మానవతా సాయంపై, పౌరులను, మహిళలను, పిల్లలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా కాల్పుల విరమణపై చర్చలు జరగాలని .. ఈ దిశగా మానవతా సాయంపై ఇరుపక్షాలు అంగీకరించాలని రష్యా తీర్మాణాన్ని ప్రవేశపెట్టింది.
అయితే రష్యా ప్రవేశపెట్టిన తీర్మాణానికి మొత్తం 15 దేశాల్లో కేవలం రష్యా, చైనా మాత్రమే మద్దతు తెలపగా.. ఇండియాతో పాటు 13 దేశాలు ఓటింగ్ కు దూరంగా ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి సంబంధించిన తీర్మానాలకు భారత్ గతంలో భద్రతా మండలిలో రెండు పర్యాయాలు, జనరల్ అసెంబ్లీలో ఒకసారి గైర్హాజరైంది. గతంలో అమెరికా, రష్యాకు వ్యతిరేఖంగా ప్రవేశపెట్టిన తీర్మాణాలకు కూడా భారత్ గైర్హజరు అయి తన తటస్థ వైఖరిని వెల్లడించింది.