ఉక్రెయిన్ లో ఉన్న భారతీయ పౌరులకు గుడ్ న్యూస్… ఉద్రిక్తత మధ్య కీలక నిర్ణయం తీసుకున్న విమానయాన శాఖ.

-

రష్యా- ఉక్రెయిన్ దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణ అలాగే ఉంది. రష్యా యుద్దానికి మొగ్గు చూపించడం లేదని అంటున్నా.. యూరోపియన్ దేశాలు, అమెరికాలు.. రష్యా మాటలను విశ్వసించం లేదు. యుద్ధం ఎప్పుడైనా రావచ్చని అంటూ… వ్యాఖ్యలు చేస్తోంది అమెరికా. ఇదిలా ఉంటే ఉక్రెయిన్ లో ఉంటున్న భారతీయులు, విద్యార్థులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉద్రిక్త పరిస్థితులు ఉండటంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

విమానం

ఇదిలా ఉంటే ఈరెండు దేశాల మధ్య ఉద్రిక్తతులు తలెత్తుతున్న తరుణంలో భారత ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్- ఇండియాల మధ్య ఎన్ని అయినా విమానాలు నడపవచ్చని తెలిపింది. విమానాలు, చార్టర్ జెట్లపై పరిమితిని ఎత్తేసింది. దీంతో పాటు కరోనా నేపథ్యంలో ఎయిర్ బబుల్ ఆంక్షలను కూడా ఎత్తేసింది. విమానాల సంఖ్యపై ఆంక్షలను ఎత్తేసింది. డిమాండ్ కు అనుగుణంగా.. విమానాల సంఖ్య పెంచాలని విమానయాన సంస్థలకు ఆదేశాలు ఇచ్చారు.  దీంతో ఉక్రెయిన్ లో ఉన్న భారతీయులు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఏర్పడింది. ఉక్రెయిన్ లో ప్రస్తుతం 20-25 వేల మంది భారత పౌరులు ఉన్నట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version