రష్యా- ఉక్రెయిన్ వార్: 800 మంది రష్యా సైనికులను మట్టుబెట్టిన ఉక్రెయిన్

-

ఉక్రెయిన్ పై రష్యా భీకర దాడులు చేస్తోంది. రాజధాని కీవ్ ను దక్కించుకునేందుకు రష్యన్ ఆర్మీ తీవ్ర ప్రయత్నం చేస్తోంది. ఉక్రెయిన్ లోని ఆర్మీ బేస్ లే లక్ష్యంగా రష్యన్ ఆర్మీ విరుచుకుపడుతోంది. ఇదిలా ఉంటే నిన్న ఒక్క రోజే 800 మంది రష్యా సైనికులను మట్టుబెట్టామని ఉక్రెయిన్ రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 130 ఫైటర్ వెహికిల్స్, 30 యుద్ధ ట్యాంకులుతో పాటు 7 విమానాలు, 6 హెలికాప్టర్లను నాశనం చేశామని పేర్కొంది. 

మరోవైపు తొలిరోజు దాడులు విజయవంతం అయ్యాయని రష్యా ప్రకటించింది. ఉక్రెయిన్ లోని 83 ఆర్మీ స్థావరాలపై దాడులు చేసినట్లు రష్యా ప్రకటించింది. రాజధాని కీవ్ ను దక్కించేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తోంది రష్యన్ ఆర్మీ. ఇప్పటికే కీవ్ కు వెళ్లే అన్ని రహదారులను దిగ్భందించాయి రష్యన్ బలగాలు. కీవ్ కు సమీపంలో ఉన్న ఎయిర్ స్ట్రిప్ ను రష్యా స్వాధీనం చేసుకున్నాయి. కీవ్ నగరంలోకి రష్యన్ బలగాలు ప్రవేశించినట్లు ఉక్రెయిన్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాయి.

Read more RELATED
Recommended to you

Latest news