ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన ప్రకటన చేశారు. రష్యా డిమాండ్ల కు అంగీకరిస్తే ఉక్రెయిన్ పై చర్చలకు సిద్దమని వెల్లడించారు. కివీ, ఇతర పెద్ద నగరాలపై రష్యా వైమానిక దాడులు చేస్తోందని అనడం పెద్ద బూటక ప్రచారం, అబద్దమని చెప్పారు. క్రిమియా ను రష్యా అంతర్భాగం గా గుర్తించాలని.. తూర్పు ఉక్రేయిన్ లో ప్రత్యేక ప్రాంతాల సార్వభౌమత్వాన్ని గుర్తించాలని డిమాండ్ చేశారు. ఉక్రెయిన్ తటస్థ దేశంగా ఉండాలని పేర్కొన్నారు పుతిన్.
అప్పుడే చర్చలకు సిద్దామన్నారు. కాగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది. ఉక్రేయిన్ లోని “అణు విద్యుదుత్పతి కేంద్రం” పై రష్యా దాడి పై చర్చ నిర్వహించనుంది. రష్యా దాడిలో ముగ్గురు ఉక్రెయిన్ సైనికులు మృతి, ఇద్దరు సైనికులుకు గాయాలు అయ్యాయి.
అయితే “ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి” ఓటింగ్ లో పాల్గొనని భారత్… ఉక్రెయిన్-రష్యా యుద్ధం లో జరిగిన ఉల్లంఘనల పై విచారణ జరిపేందుకు కమిటీ ఏర్పాటు పై నిర్వహించిన ఓటింగ్ కు దూరంగా ఉంది. యుద్ధ జోన్ల లో చిక్కుకుపోయున ప్రజలను సురక్షితంగా తరలించేందుకు తక్షణమే వెసులుబాటు కల్పించాలని “రెడ్ క్రాస్ అంతర్జాతీయ కమిటీ” కి విజ్ఞప్తి చేశారు ఉక్రేయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ.