అక్కడ దేవాలయంలో చనిపోయిన వారిని బతికిస్తారట..!

-

ఈ భూమండలం మీద సనాతన సంప్రదాయాలు, సంస్కృతి గల దేశం మన భారత దేశం. ఇక్కడ ఎన్నో చారిత్రాత్మక కట్టడాలు, వాటిలో ఎన్నో మహిమాన్విత ఆలయాలు ఉన్నాయి. అలాంటి దేవాలయాల్లో ఒకటి ఈ లఖ్ మందిర్ దేవాలయం. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో డెహ్రాడూన్ జిల్లా లో చంసేర్ బావర్ అనే ప్రదేశంలో ఈ ఆలయంలో ఉంది.ఇక్కడికి వెళ్ళాలంటే చక్రతా నుండి రోడ్ మార్గంలో వెళ్ళవచ్చు. ఈ ఆలయం చక్రతా నుండి 100 కిలోమీటర్లు, డెహ్రాడున్ నుండి 130 కిలోమీటర్లు ఉంటుంది.

ఇక్కడ సాక్షత్ ఆ పరమశివుడు కొలువై ఉంటాడు. ఇంకా ఈ ఆలయానికి ద్వాపర యుగం నుండి చాల విశిష్టమైన చరిత్ర కలదు.పాండవులు మహాభారత యుద్ద సమయంలో ఇక్కడ ఒక లక్క ఇంట్లో నివాసం ఉన్నారని అదే ఇప్పుడు ఈ ఆలయం ఉన్న ప్రదేశం అని స్థానికుల కధనం.అక్కడ గల లఖ్ మండల మందిరం లోని అభిషేక జలంతో చనిపోయిన వారిని కొన్ని నిమిషాల పాటు బతికించవచ్చు. అదెలా సాధ్యం అని ఆశ్చర్య పోతున్నారా..!

పాండవులు తిరిగిన ప్రదేశం కాబట్టి దీనికి చాల ప్రాధాన్యం పొందింది. ఇక ఇక్కడి ఆలయానికి ప్రవేశ ద్వారం వద్ద ఇరువైపులా మానవ, దానవ విగ్రహాలు ఉంటాయి. స్థానికులు వీటిని భీమసేనుడు, అర్జునుడు గా నమ్ముతారు. కాని ఆ విగ్రహాలు రెండు విష్ణువు ఉండే వైకుంట ద్వారానికి ఇరు వైపులా ఉండే జయ,విజయులు గా చరిత్ర చెబుతుంది. ఏది ఏమైనా ఇక్కడ గల పరమ శివుని లింగాకారం గ్రానైట్ తో తయారుచేసారు. దాని ప్రకాశానికి ఆ చుట్టుపక్కల అందంగా కనపడుతుంది.ఈ స్వామీ అత్యంత మహిమ గలవానిగా ప్రతీక.అందుకే ఆ స్వామీ ని అభేషేకించిన జలాన్ని చనిపోయిన వారికి పట్టిస్తే వారు కొన్ని ఘడియల పాటు బతుకుతారని ఇక్కడి వారి నమ్మకం.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version