తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. తెలంగాణ మంత్రులకు సైతం కరోనా సోకుతుంది ఈ నేపద్యంలో తెలంగాణ ప్రభుత్వం మరోసారి లాక్ డౌన్ అమలు చేసే దిశగా అడుగులు వేస్తుంది. ఈమేరకు మంత్రివర్గ సమావేశం కూడా నిర్వహించనుంది. వైద్య ఆరోగ్య శాఖా మంత్రి ఈటెల రాజేందర్ కరోనా సంక్రమణాన్ని తగ్గించాలంటే లాక్ డౌన్ తప్పదని సీఎం కేసీఆర్ కు నివేదిక కూడా ఇచ్చినట్టు తెలుస్తుంది కానీ కేబినెట్ లోని మరి కొందరు మంత్రులు మాత్రం లాక్ డౌన్ కు వ్యతిరేకతను తెలుపుతున్నారు. విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కరోనా కట్టడికి లాక్ డౌన్ పరిష్కారం కాదన్నారు. మరోసారి లాక్ డౌన్ పేదితా చిన్న కుటుంబాలు చితికిపోతాయని వారికి ఉపాధి దొరకదని ఆమె పేర్కొన్నారు. జాగ్రత్తలు తీసుకుంటూ కరోనాని కట్టడి చేద్దామని పేర్కొన్నారు మంత్రి సబితారెడ్డి. కాగా తెలంగాణలో కరోనా విజృంభణ పెరుగిపోతుందితో. గడిచిన 24 గంటల్లో 975 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరోపక్క తెలంగాణలో ఇప్పటికే 16339 కేసులు నమోదయ్యాయి..! ఇక విషయం పై సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారు అనేదాని పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
లాక్ డౌన్ పెట్టొద్దు..! లాక్ డౌన్ కు సబితక్క ససేమిరా…!
-