రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుల మాటలను ప్రజలు నమ్మడం లేదు : మంత్రి సబితా

-

తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైంది. ఓ పార్టీకి చెందిన నేతలు మరోపార్టీల్లోకి జంపింగ్‌లు చేస్తున్నారు. అయితే.. ఈ నేపథ్యంలోనే బుధవారం మహేశ్వరం మండల పరిధిలోని ఉప్పుగడ్డ తండాకు చెందిన కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుల మాటలను ప్రజలు నమ్మడం లేదని పేర్కొన్నారు. రోజుకో హామీతో ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారని మంత్రి సబితా ఆరోపించారు.

రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ అభ్యర్థులను ప్రకటించిన తరువాత ప్రతి పక్ష నాయకులు గందరగోళంలో పడ్డారని మంత్రి సబితా వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాలలో శరవేగంగా అభివృద్ధి చెందుతుందని మంత్రి సబితా అన్నారు. సంక్షేమ రంగంలో తెలంగాణ దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలుస్తుందని, వీటిని ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని మంత్రి సబితా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు అంగోతు రాజునాయక్‌, సేవాలాల్‌ దేవాలయ చైర్మన్‌ సీతారాం నాయక్‌, రవీందర్‌నాయక్‌, సురేశ్‌ నాయక్‌, గ్రామ సర్పంచ్‌ నేజి రెడ్యానాయక్‌, కళ్యాణ్‌ నాయక్‌, మాజీ జడ్పీటీసీ ఈశ్వర్‌నాయక్‌, నేనావత్‌ రాజునాయక్‌, దేశీయ రాజ్‌కుమార్‌ , నాయకులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news