సీఎం కేసీఆర్‌ అన్ని రంగాల వారిని ఆదుకుంటున్నారు : సబితా

-

రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలంలో మైనార్టీలకు ఎకనామిక్‌ సపోర్ట్‌ స్కీంలో భాగంగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి రూ. లక్ష ఆర్థిక సహాయం చెక్‌లను మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని అన్నారు. సీఎం కేసీఆర్‌ దార్శినిక పాలనలో తెలంగాణలో హిందూ ముస్లింలు కలిసి మెలిసి ఐక్యతను చాటుతున్నారని మంత్రి సబితా వెల్లడించారు.

దేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ మాదిరిగా బడ్జెట్‌ కేటాయింపు చేయలేదని మంత్రి సబితా తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మైనార్టీ సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ రూ. 10వేల కోట్లు ఖర్చు చేశారని మంత్రి సబితా పేర్కొన్నారు. విద్యార్థుల కోసం 204 పాఠశాలలను ఏర్పాటు చేసి నాణ్యమైన విద్యను అందిస్తూ ముస్లిం యువతను రేపటి పౌరులుగా తీర్చిదిద్దుతున్న ఘనత తెలంగాణ రాష్ట్రానిదేనని అన్నారు. మైనార్టీలోని పేదలు, నిరుద్యోగులు సొంత వ్యాపారాలు నిర్వహించుకోవడానికి రూ. లక్ష రూపాయల ఉచిత గ్రాంట్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సీఎం కేసీఆర్‌ అన్ని రంగాల వారిని ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్‌పర్సన్‌ తీగల అనితా హరినాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు, మైనార్టీ నాయకులు శమీర్‌, ఎండి అమ్జద్‌, అలీ, బీఆర్‌ఎస్‌ కందుకూరు మండల మైనార్టీ అధ్యక్షుడు అలీ, డైరక్టర్‌ దేవీలాల్‌ నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version