అభివృద్ధిని నమ్ముకుంటున్న కేసీఆర్…? ఆ మంత్రి బాగా కష్టపడుతున్నారు

-

తెలంగాణలో కొన్ని కొన్ని అభివృద్ధి కార్యక్రమాల విషయంలో సీఎం కేసీఆర్ ఇప్పుడు బాగా దృష్టి పెడుతున్నారు. భారతీయ జనతాపార్టీ కొన్ని విషయాల్లో ఎక్కువగా టార్గెట్ చేస్తున్న నేపధ్యంలో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడానికి సీఎం కేసీఆర్ గట్టిగానే ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన టిఆర్ఎస్ పార్టీ బలహీనంగా ఉన్న కొన్ని జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టారు.

ఖమ్మం జిల్లాల్లో గట్టిగానే ఈ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి ప్రజాప్రతినిధులుగా ఎన్నికైన వారి ప్రాంతాల్లో కూడా ఆయన అభివృద్ధి కార్యక్రమాల మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. టిఆర్ఎస్ పార్టీ బలహీనంగా ఉన్న ఖమ్మం, అదిలాబాద్ జిల్లాలలో అభివృద్ధి వేగంగా జరుగుతుంది. అలాగే కొత్తగూడెం భద్రాచలం నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతమయ్యాయి.

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గెలిచిన అశ్వారావుపేట నియోజకవర్గంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు వేగం పుంజుకున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం జిల్లాను భారీగా అభివృద్ధి చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో తన మార్కు కనపడే విధంగా ఆయన కష్టపడుతున్నారు. ఇక సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఇతర మంత్రులు కూడా కొన్ని కొన్ని నియోజకవర్గాల మీద ఎక్కువగా దృష్టి పెట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తే తనకు ప్రయోజనం ఉంటుందని సీఎం కేసీఆర్ భావిస్తున్నారు. అందుకే భారీగా నిధులు కూడా కేటాయిస్తున్నారు సీఎం.

Read more RELATED
Recommended to you

Latest news