శ్రీలంక మాజీ క్రికెటర్ సచిత్ర సేనానాయకే ను ఈ రోజు పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాలు చూస్తే… ఇతను కొందరి ఆటగాళ్లను మ్యాచ్ ఫిక్సింగ్ చేయడానికి ఒప్పించాలని చూసినట్లు యాంటీ కరప్షన్ ఆఫీసర్ లు ఇచ్చిన రిపోర్ట్ మూలంగా పోలీసులు ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. 2020 కి సంబంధించి జరిగిన లంక ప్రీమియర్ లీగ్ లో కొందరి ఆటగాళ్లను మ్యాచ్ ఫిక్స్ చేయాలని వారిని ప్రేరేపించినట్లు ఆధారాలు ఉన్నట్లు పోలీసులు తెలుసుపుతున్నారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఇతను అప్పటికి లంక ప్రీమియర్ లీగ్ లో ఆడలేదు. అయినప్పటికీ ఇతను మ్యాచ్ లను ఫిక్స్ చేయాలని చూశారు. ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు లేకపోవడం మూలంగానే చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది.
ప్రస్తుతం పోలీసుల కస్టడీ లో ఉండగా 24 గంటల్లో ఇతన్ని కోర్ట్ లో హాజరు పరచాల్సి ఉంది. మరి ఈ కేసులో ఇతను ఒక్కడే ఉన్నాడా ? ఇంకా ఎవరికైనా ఇందులో సంబంధం ఉందా అన్న విషయాలు తెలిసే అవకాశం ఉంది.