చంద్రబాబుకు భవిష్యత్తు కళ్ళ ముందు కనపడుతోంది : సజ్జల

-

దోపిడీకి పాల్పడి తానేదో నిజాయతీపరుడిని అన్నట్లుగా చిత్రీకరించుకునేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు భవిష్యత్తు కళ్ళ ముందు కనపడుతోందని, అడ్డంగా బుక్ అయినట్లు తనకే అర్థం అయినట్లు ఉందన్నారు. అందుకే గుమ్మడి కాయ దొంగలా భుజాలు తడుముకుంటున్నాడని, చట్టాలకు చంద్రబాబు అతీతుడు కాదన్నారు. చేసిన అవినీతికి చర్యలు ఎదుర్కోక తప్పదని, సానుభూతి కోసమే అరెస్టు అంటున్నాడన్నారు.

History can't be reversed, though YSR Congress prefers unified AP: Sajjala

అంతేకాకుండా.. ‘ముడుపులు ఎటు నుంచి ఎలా వెళ్ళిందో 46 పేజీల నోటీసుల్లో ఆధారాలతో సహా బయటపడింది. చంద్రబాబు పాపం పండింది. రాజకీయ కక్ష సాధింపు చేసే ఉద్దేశం అయితే మేం అధికారంలోకి వచ్చిన వెంటనే అరెస్టు అయి ఉండే వాడు. ఇప్పటికే ఈడీ వంటి ఏజెన్సీలు రంగంలోకి దిగి ఉండాల్సింది. ఐటీ నోటీసులు సాధారణం అని పురంధరేశ్వరి చెప్పటం కరెక్ట్ కాదు. చంద్రబాబును రక్షించే ప్రయత్నమా? తెలియని తనమా? ఇండియా పేరు మార్చి భారత్ అని పెట్టడం వల్ల ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏంటి? ప్రపంచం ఇండియాగా చూస్తుంది…మనం భారత దేశం అని పిలుస్తాం. రెండు పేర్లు బాగానే ఉంటాయి. ఈ అంశం పై ఈ స్థాయిలో చర్చ అనవసరం. జమిలి ఎన్నికలు ఆదర్శనీయ అంశమే అయినా ఆచరణలో చాలా ప్రశ్నలు ఉన్నాయి. ప్రజాస్వామ్య, ఫెడరల్ స్ఫూర్తి దెబ్బ తినకుండా ఎలాంటి ప్రతిపాదనలు కేంద్రం తీసుకుని వస్తుందో చూడాలి. ఈ రెండు అంశాలపై జగన్ చర్చించి పార్టీ విధానాన్ని వెల్లడిస్తారు.’ అని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news