ఏపీ ప్రభుత్వానికి పలువురు సచివాలయ ఉద్యోగులు షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. చాలా మంది ఉద్యోగులు అధికారిక వాట్సాప్ ఖాతాల నుండి లెఫ్ట్ అయ్యినట్టు సమాచారం అందుతోంది. చాలామంది నిరుద్యోగులు కింది స్థాయిలో చిరుద్యోగులుగా చేరిన సంగతి తెలిసిందే. అయితే ఉద్యోగం లో చేరి రెండేళ్లు అయినా తమకు ఇచ్చిన మాట ప్రకారంగా ప్రొబేషన్ కన్ఫర్మేషన్ ప్రక్రియ పూర్తిచేయకపోగా…
ఈ ఏడాది జూన్ 30 లోగా చేస్తామని సీఎం ప్రకటించడం పై రాష్ట్రం లోని అన్ని జిల్లాల గ్రామ మరియు వార్డు సచివాలయ ఉద్యోగుల్లో ఎక్కువమంది నిరాశకు గురైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నే జిల్లా సంయుక్త కలెక్టర్ లు అడ్మిన్ లుగా ఉన్న అధికారిక వాట్సాప్ గ్రూప్ ల నుండి లెఫ్ట్ అయ్యి ఉద్యోగులు తమ నిరసన తెలుపుతున్నట్టు సమాచారం. కొంతమంది గ్రూప్ ల నుండి నేరుగా లెఫ్ట్ అవ్వగా మరికొంతమంది ప్రొబేషన్ పెంచకపోవడం వల్లే ఇలా చేశారని కామెంట్స్ చేస్తున్నారు.