పాకిస్థాన్ విషాదం చోటు చేసుకుంది. పాక్ లోని ప్రముఖ హిల్ స్టేషను ముర్రేలో భారీగా మంచు కురిసి ఏకంగా 22 మంది మరణించారు. దీంతో ముర్రేని విపత్కర ప్రాంతంగా పేర్కొంటూ శనివారం అక్కడి సర్కార్ ఎమర్జెన్సీ ప్రకటించింది. మృతుల్లో 10 మంది పిల్లలు, ఇస్లామాబాద్ కు చెందిన పోలీస్ అధికారి నవీద్ ఇక్బాల్ తో పాటు ఆయన కుటుంబ సభ్యులు ఉన్నారు. వీరంతా హితపాతం నడుమ వాహనాల్లో చిక్కుకున్నారు. శరీర ఉష్ణోగ్రతలు తగ్గిపోయి… ఊపిరాబక మరణించారు.
ఇక ఈ సంఘటనపై పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ ఈ దుర్ఘటన పై తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. పంజాబ్ ప్రావిన్సులోని మనోహర పర్యటక ప్రాంతం ముర్రే. ఇస్లామాబాద్ కు 45.5 కీలోమీటరల దూరం ఉన్న ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మైనస్ 8 డిగ్రీలకు పడిపోయాయి. ఇలాంటి తరుణంలో ఈ ప్రమాదంలో చోటు చేసుకుంది. ఈ సంఘటన జరుగడంతో…. అక్కడి అధికారులు అలెర్ట్ అయ్యారు. ఇలాంటి ఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.