పాపం… భార్యల చేతుల్లో నరకం చూస్తున్న భర్తలు…!

-

లాక్ డౌన్ పుణ్యమా అని సిగరెట్ తాగడానికి లేదు రెండు పెగ్గులు మందు తాగడానికి లేదు. పక్కింటి వాళ్ళతో మాట్లాడటానికి లేదు ఎదురింటి వాళ్ళతో పేక ఆడటానికి లేదు. అదే ఇల్లు అదే మొహాలు, అదే పిల్లలు, అదే గోల… మగాళ్ళ పరిస్థితి ఇప్పుడు నరకంలా ఉంది. భార్య వండితే తిండి లేకపోతే పస్తులు పడుకోవడం. భార్యకు ఆకలి వేస్తే భర్తకు కూడా వేస్తుంది. భార్య నిద్ర లేవకపోతే కాఫీ నీళ్ళు కూడా లేవు.

పైకి చెప్పలేని దరిద్రం… లోపల ఏడవడం తప్పా ఏమీ చేయలేని స్థితి. పాపం ఇప్పుడు భర్తలు నరకం చూస్తున్నారు అనేది వాస్తవం. ఎందరో భర్తలు ఇప్పుడు ఇళ్ళ నుంచి బయటకు రావడం లేదు. పిల్లలు ఏడిస్తే వాళ్ళే ఆడించాలి, భార్య కూరగాయలు కోయమని చెప్తే వాళ్ళే కొయ్యాలి. ఇల్లు ఊడవాలి, ఖర్మ కొద్దీ పని వాళ్ళు రావడం లేదు. తిన్న పళ్ళెం నుంచి బెడ్ షీట్ వరకు వాళ్ళే ఉతుక్కోవాలి.

ఇంట్లో సామాన్లు సర్దాలి… బట్టల బీరువా సర్దాలి. పిల్లల సమస్యలను పరిష్కరించాలి… వాళ్ళు గొడవ పడితే బుజ్జగించాలి. భార్య చూసిన ఛానల్ చూడాలి. లేదా పిల్లలు చూసిన ఛానల్ చూడాలి. మార్చండి అని అడగడానికి లేదు. మారిస్తే అలగడమే. వాళ్ళు అలిగారు కదా అని బయటకు వెళ్ళడానికి లేదు. గొడవ పడితే పక్కింటి వాళ్లకు వినపడుతుంది. ఒంటరిగా గంట పడుకోవడానికి ఉండదు.

వర్క్ చేస్తుంటే… ఏవండీ వచ్చి రెండు ఉల్లి పాయలు ముక్కలు కోయండి అట్టు వేస్తా అని భార్య… డాడీ అంటూ మరొకరు. ఇలా భర్తలకు దిన దిన గండం నూరేళ్ళ ఆయుష్షు అన్నట్టు ఉంది పరిస్థితి. ఫోన్ నొక్కుతుంటే ఎవరికి మెసేజ్ అని భార్య… వీడియో చూస్తుంటే నేను కూడా చూస్తా డాడీ అని కొడుకు. ఎవడికి చెప్పుకోవాలి గురూ ఈ బాధలు. ఎవడు వింటాడు. ఇప్పుడు లాక్ డౌన్ లో భర్తలు చూస్తున్న నరకం ఇదే.

Read more RELATED
Recommended to you

Exit mobile version