సీఎం జగన్ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ వైద్యులు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు స్వయానా పిల్లనిచ్చిన మామ ఈసీ చిన్న గంగిరెడ్డి కన్నుమూశారు. చిన్న గంగిరెడ్డి జగన్ సతీమణి భారతి తండ్రి, అయితే ఆయన గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న గంగిరెడ్డిని హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉన్న కాంటినెంటల్ హాస్పిటల్ లో చికిత్స కోసం జాయిన్ చేశారు.
మొన్న తిరుమల పర్యటన అనంతరం కూడా జగన్ వెళ్లి ఆయన్ని పరామర్శించి వచ్చారు. ఇక ఈ ఉదయం ఆయన హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనకు పులివెందులలో పేదల డాక్టర్‌గా మంచి పేరు ఉంది. ఇక ఈసీ గంగిరెడ్డి మరణంతో జగన్ ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి. అయితే తాజాగా ఈయన సోదరుడు కూడా అనారోగ్యంతో కన్నుమూశారు.